ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాలను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను(Cadaver Dogs) తీసుకొచ్చారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎస్‌ఎల్‌బీసీకి చేరుకుంటేనే క్యాడవర్ డాగ్స్.. డ్యూటీ ఎక్కేశాయి. వాటిని రెస్క్యూ టీమ్స్ టన్నెల్‌లోకి తీసుకెల్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో పాటు సింగరేరణి, ఎన్‌డీఆర్ఎఫ్(NDRF) బృందాలు కూడా టన్నెల్‌లోకి వెళ్లాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీప్ సెక్రటరీ అరవింద్ కుమార్.. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్యాడవర్ డాగ్స్‌తో పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో రోబోలు కూడా పాల్గొన్నాయి.
Cadaver Dogs ఏం చేస్తాయి?
భద్రతా బలగాలు వాడే జాగిలాలలో ఇవి కూడా ఒకటి. మిస్టరీగా మారిన కేసులను ఛేదించడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యక్తుల వాసనలను బట్టి ఇవి కేసును సాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే స్నిఫర్ డాగ్స్‌కు వీటికి చాలా తేడా ఉంటుంది. స్నిఫర్ డాగ్స్ అనేవి వ్యక్తుల వాసనలను పసిగడితే.. ఈ క్యాడవర్ డాగ్స్ అనేవి కుళ్లుతున్న మృతదేహం వాసనను పసిగడతాయి. ఈ వాసనను పసిగట్టడంలో క్యాడవర్ డాగ్స్ 95శాతం పాజిటివ్ రిజల్ట్స్‌ను అందిస్తాయి. మృతదేహం లభించని, మృతదేహం కీలకంగా మారిన కేసులలో వీటిని వినియోగిస్తారు. శరీరం కుళ్లిపోయే సమయంలో వచ్చే వాసనను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందుతాయి. భూమిలో 15 అడుగుల కింద పాతిపెట్టబడిన దేహాల వాసనను కూడా ఇవి పసిగట్టగలవు. ఇప్పుడు ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ డాగ్స్ ద్వారా బురదలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. మరి వారు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.