Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

-

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్‌ (CapitaLand) ముందుకొచ్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్‌ హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది.

- Advertisement -

సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu), ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.

క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్(Hyderabad) అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.

Capitaland investment | క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.

Read Also: కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hyderabad | లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు.. ఆసుపత్రిలో మృతి

Hyderabad | నాంపల్లిలో రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్...

SLBC Tunnel | కూలిన ఎస్‌బీసీ టన్నెల్.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం

SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ...