Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులు నిర్వర్తించకుండా అడ్డగించారని పేర్కొంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి సహా 20 మందిపై బంజారాహిల్స్(Banjara Hills) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, అది చేస్తున్నవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి వెళ్లిన క్రమంలో ఆయనపైనే కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అయితే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని పేర్కొంటూ ఫిర్యాదు ఇవ్వడం కోసం బుధవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy).. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెళ్లాలని డిమాండ్ చేశారు. తాను ఒక అర్జెంట్ పనిపైన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఆయన ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పారు. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం తనను తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులపై సీఐ ఫిర్యాదు చేశారు.

Read Also:  హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు.. ఏ కేసుపైనంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....