రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

-

Case filed over the rumours on revanth reddy new party: తెలంగాణ రాజకీయాల్లో మరో వార్త కలకలం రేపింది. టీ కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ వలసనేతల వివాదం చెలరేగుతూనే ఉంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై సీనియర్లు అగ్గి మీద గుగ్గిలంలా భగ్గుమంటున్నారు. ఆయన ఎంట్రీ తోనే కాంగ్రెస్ దిగజారింది అంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ ప్రచారంతో రేవంత్ వర్గం ఒక్కసారి ఉలిక్కిపడింది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న వార్తలపై సీరియస్గా రియాక్ట్ అయింది. ఎవరో కావాలని తమ నాయకుడిపై కుట్రపన్నారంటూ రేవంత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ వార్తలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు కొత్త పార్టీ పెడుతున్నారంటూ అసత్య ప్రచారం మొదలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read Also: విద్యార్థులకు Telangana సర్కార్ గుడ్ న్యూస్.. సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...