సన్ బర్న్ ఈవెంట్(Sunburn Event) మేనేజర్ సుశాంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. షో కి అనుమతి లేకుండా టికెట్లు అమ్మినందుకు ఆయన పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. సన్ బర్న్ పేరుతో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించాలి అనుకున్న సుశాంత్.. అసలు ఈవెంట్ కన్ఫామ్ కాకుండా బుక్ మై షో లో టికెట్లు రిలీజ్ చేయించారు. దీంతో ఆసక్తి ఉన్న చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు.
గత కొద్దిరోజులుగా సన్ బర్న్ ఈవెంట్(Sunburn Event) పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళ నుండి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సన్ బర్న్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ఈవెంట్ గోవా లో నిర్వహించగా వివాదాస్పదం అయింది. దీంతో గోవా(Goa) ప్రభుత్వం ఈవెంట్ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చింది. దీంతో ఈసారి హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. నిబంధనలను అనుసరించే వారికే పర్మిషన్స్ ఇస్తోంది. అయితే సన్ బర్న్ ఈవెంట్ కి మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బుక్ మై షోలో టికెట్స్ రిలీజ్ చేశారు. దీంతో బుక్ మై షో(BookMyShow), సన్ బర్న్ నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈవెంట్ మేనేజర్ సుశాంత్(Sushant) పైన చీటింగ్ కేసు నమోదు చేశారు.