Delhi Liquor Scam | లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ..

-

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. ఈ మేరకు ఈనెల 26న విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కవితను ఈడీ అధికారులు మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అలాగే 2022లో సీబీఐ కూడా ఆమెను ప్రశ్నించింది. తాజాగా కవితను ఈ కేసులో నిందితురాలిగా చేరుస్తూ సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Delhi Liquor Scam | మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆప్ నేతలు, మంత్రులు తమ నేతను సీబీఐ అధికారులు మరో రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal)తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశముందనే చర్చ జోరుగా జరుగుతోంది. మరి కవిత(Kavitha) విచారణకు హాజరవుతారా..? లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

Read Also: రూ.500లకే సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు.. ఎప్పటి నుంచంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Orange Benefits | శీతాకాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..!

Orange Benefits | శీతాకాలం అంటేనే ఎముకలు కొరికే చలి, కారుతున్న...

Rashmika | ‘సల్మాన్ చాలా కేర్ తీసుకుంటాడు’.. రష్మిక మందన

రష్మిక మందన(Rashmika).. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ...