CBI Serves Another notice to MLC Kavitha Under 91 CRPC: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం సిబిఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. విచారణ పూర్తయిన గంటల వ్యవధిలోని సిబిఐ ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. సిఆర్పిసి సెక్షన్ 91 ప్రకారం ఈ నోటీసులు అందించింది సిబిఐ. దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు, డాక్యుమెంట్లు, ఇతర మెటీరియల్ అందజేయాలన్నది ఈ నోటీసు సారాంశం. ఇవి ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి అనే అనే అంశాలు మెయిల్ ద్వారా పంపిస్తామని సిబిఐ తెలిపింది. కాగా నోటీసు అందుకున్న వ్యక్తి ఈ డాక్యుమెంట్లు స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్ క్లాజ్ 2 ద్వారా జారీ చేసి ఉంటే ఇతరులతో కూడా డాక్యుమెంట్లు, ఆధారాలు పంపవచ్చు.
అయితే సిఆర్పిసి 91 సెక్షన్ కింద కవితక నోటీసులు(CBI Notice to MLC Kavitha) అందించడంతో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలు కవిత దగ్గర ఉన్నట్టు సిబిఐ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి కవిత ఈ ఆధారాలు ఎలా సమర్పిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే ఆమె ఏం చేయనున్నారు అనే చర్చ మొదలైంది. విచారణ పూర్తయిందని సిబిఐ అధికారులు తాను పూర్తిగా సహకరించానని తండ్రితో భేటీ అయిన కొద్దిసేపటికి ఈ నోటీసులు వెలువడడం టిఆర్ఎస్ అధిష్టానాన్ని, పార్టీ శ్రేణులను ఆందోళన కలిగిస్తోంది.