వరంగల్‌లోని మామురు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా తాజాగా ఈ పనులకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ విమానాశ్రయం అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వంలో గతంలోనే పలుమార్లు ప్రతిపాదనలు పెట్టింది. కాగా ఇప్పుడు వీటికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చాలా కీలకంగా మారనుంది. కాగా ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.