Telangana Corona Cases |అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాలకు లేఖలో రాసిన వాటిలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది. గురువారం దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి.
Read Also: ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు
Follow us on: Google News