రూ.2 వేల నోట్లు మార్చాలా.. పాతబస్తి వ్యక్తి వినూత్న నిర్ణయం!

-

Hyderabad |రూ.2వేల నోటు రద్దు చేస్తూ ఆర్​బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. మే 23 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ లోగా రూ.2వేల నోటును బ్యాంకులు, ఆర్​బీఐ కార్యాలయాలలో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఒక్క రోజులో గరిష్ఠంగా రూ.20వేల వరకు ఎక్స్​చేంజ్​ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచే బ్యాంకుల్లో రూ.2వేల నోట్లు ఎక్స్​చేంజ్​ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అయితే రూ.2వేల నోటు రద్దు చేస్తూ ఆర్​బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న నాటి నుంచే మార్కెట్​లో వ్యాపార లావాదేవీలతో పాటు హోటళ్లు ఎక్కడ కూడా 2వేల నోటును తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి.

- Advertisement -

Hyderabad |బ్యాంకుల్లో క్యూలైన్​ లో నిలబడి నానావస్థలు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని పాతబస్తీలోని ఓ పెట్రోల్ యాజమాన్యం విన్నూత్నంగా ఆలోచించి ​ బంక్​ రూ.2వేల నోటుకు బంపర్​ ఆఫర్​ ఇవ్వడమే గాకుండా ఓ నిబంధనను కూడా (షరతులు వర్తిస్తాయి) పెట్టింది. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని నయారా పెట్రోల్​ బంక్​లో రూ.500 పెట్రోలు పోసుకుంటేనే రూ.2వేల నోటుకు చిల్లర ఇస్తామని ఓ నోటీసు బోర్డును అతికించింది. దీంతో పలువురు ఉంటే మన వాహనంలోనే పెట్రోలు ఉంటది కదా.. పెట్రోలు పోసుకుని 2వేల నోటును వదిలించుకోవడానికే రూ.500 పెట్రోల్​ పోసుకోవడానికి కూడా వెనుకాడక పోవడం గమనార్హం.

Read Also:
1. శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు
2. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...