హైదరాబాద్ బోనాల వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. క్యాసినో కేసులో తీవ్ర చర్చనీయాంశమైన చీకోటి ప్రవీణ్(Chikoti Praveen) పండగపూట మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం లాల్ దర్వాజా(Lal Darwaza) సింహావాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి చీకటి ప్రవీణ్ కుమార్ తన ప్రయివేట్ సెక్యూరిటీతో వచ్చారు. తనతో ఉన్న ప్రయివేట్ సెక్యూరిటీ రివాల్వర్లతో ఆలయంలోకి వచ్చారు. దీంతో విషయం తెలిసిన వెంటనే ఆలయానికి వచ్చిన పోలీసులు ప్రయివేట్ సెక్యూరిటీ నుంచి మూడు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.