Kuchukulla Damodar Reddy | బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. మహబూబ్ నగర్ కీలక నేత జంప్!

-

ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గెలుపు మాదే అంటూ ధీమాతో ఉన్న గులాబీ దళంలో.. వరుస ఫిరాయింపులు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బడా నేత త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు చెప్పకనే చెప్పేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. సీనియర్ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి(Kuchukulla Damodar Reddy).

- Advertisement -

Kuchukulla Damodar Reddy

గత కొంతకాలంగా దామోదర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తో పాటే ఈయన కూడా కాంగ్రెస్ తీర్థం పంచుకుంటారని వార్తలు వినిపించాయి. అలా జరగకపోవడంతో దామోదర్ రెడ్డి(Kuchukulla Damodar Reddy) తన ఆలోచన మార్చుకున్నారేమో అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరవడంతో మరోసారి దామోదర్ రెడ్డి పార్టీ మార్పు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారతారా లేదా అని ఉత్కంఠకు తెరపడింది. అందరికీ షాక్ ఇస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో దామోదర్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు అయింది. కాగా ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: కేటీఆర్.. మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా?

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...