భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Ambedkar) విశ్వమానవుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar)తో కలిసి కేసీఆర్(CM KCR) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు అంబేద్కర్ ఆదర్శం అని అన్నారు. ఆయన ఆశయాలు అమలు జరుగుతున్నాయా? లేదా అనేది దేశంలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు.
ఆ మహనీయుడి పేరుమీద రూ.51కోట్ల నిధులతో ప్రతీ జయంతి రోజున అవార్డులు అందిస్తామని సీఎం(CM KCR) ప్రకటించారు. 2014కు ముందు పదేళ్లు పాలించిన ప్రభుత్వం దళిత కోసం రూ.16 వందల కోట్లు ఖర్చు చేస్తే.. ఈ పదేళ్ళలో రూ.1లక్ష కోట్లకు పైగా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. మన ప్రభుత్వం రాగానే దేశంలో 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబందు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రభంజనం యూపీ, బెంగాల్, ఒడిశాలో రాబోతోందని అన్నారు.
Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం సంచలన ప్రకటన
Follow us on: Google News, Koo, Twitter