తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా చింతలమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి కేటీఆర్ దంపతులు ఖైరతాబాద్‌లో, మంత్రి హరీశ్ రావు దంపతులు సిద్ధిపేటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్ – 41.88%, భద్రాద్రి – 39.29, హన్మకొండ 35.29, హైదరాబాద్ 20.79, జగిత్యాల 46.14, జనగామ 44.31, భూపాలపల్లి 49.12, గద్వాల్ 49.29, కామారెడ్డి 40.78, కరీంనగర్ 40.73, ఖమ్మం 42.93, కుమురం భీం 42.77, మహబూబాబాద్ 46.89, మహబూబ్ నగర్ 44.93, మంచిర్యాల 42.74, మెదక్ 50.80, మేడ్చల్ 26.70, ములుగు 45.69, నాగర్ కర్నూల్ 39.58, నల్గొండ 39.20, నారాయణపేట 42.60, నిర్మల్ 41.74, నిజామాబాద్ 39.66, పెద్దపల్లి 44.49, సిరిసిల్ల 39.07, రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17, సిద్ధిపేట 44.35, సూర్యాపేట 44.14, వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25, భువనగిరి 45.07 శాతంగా నమోదయ్యాయని వెల్లడించారు.