తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. నేతలంతా ప్రజల్లో ఉండాలని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంతేగాక, రాబోయే అక్టోబరులో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉంటుందని అన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని, వీలైతే నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు చేయాలని నేతలకు సూచించారు. ముఖ్యంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా నియోజకవర్గా్ల్లో ఉండి కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలి, బీజేపీకి కౌంటర్‌గా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల వరకు ప్రజాల్లోనే ఉండాలని సూచనలు చేశారు. అభివృద్ది పనులు పెడింగ్లో లేకుండా చూసుకోవాలని కేసీఆర్(KCR) తెలిపారు.
Read Also: రేపు కవితను అరెస్టు చేయొచ్చు.. ఈడీ నోటీసులపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్
Follow us on: Google News