బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జాక్ పాట్ తగిలింది. పార్టీలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు వరించాయి. ఈసారి ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్, జనగామ సెగ్మెంట్లలో ఇద్దరు సిట్టింగ్ లకు టికెట్లు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) వారికి కొత్త పదవులను సర్దుబాటు చేశారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(MLA Muthireddy), తాటికొండ రాజయ్య(MLA Rajaiah)ను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah)ను రైతుబంధు కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సెగ్మెంట్ టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన నందికొండ శ్రీధర్(Nandikonda Sridhar) కు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేశ్(Uppala Venkatesh) ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Thatikonda Rajaiah appointed as chairman of Rythu Bandhu Samithi
Muthireddy Yadgiri Reddy appointed as TSRTC chairman
Nandikanti Sridhar chairman of MBC development corporation
Uppala Venkatesh Vice Chairman Mission Bhagiratha Corporation pic.twitter.com/fB5J25mgEY
— Naveena (@TheNaveena) October 5, 2023