పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

-

తెలంగాణలోని పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్(CM KCr) గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వైద్యశాఖలో నవశకానికి అడుగులు వేశారు కేసీఆర్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీ లను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 9 జిల్లాల్లో ఒకేసారి మెడికల్ కాలేజీలు ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని మెడికల్ కాలేజీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులను ప్రారంభించాలని ఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావుకు, అధికారులకు సూచించారు. దీంతో పేద విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని, పారామెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా.. అర్హత ఉన్న వారికే సీట్లు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రతి ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోంది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి జనాభాకు 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి గర్వంగా ఉంది. 500 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన రాష్ట్రానికి ఉంది. తెలంగాణలో పదివేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయి అని కేసిఆర్ చెప్పుకొచ్చారు.

పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నట్లు కేసీఆర్ గుర్తు చేశారు. వారికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76శాతం ప్రసవాలు జరుగుతున్నాయి అని తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR). ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao)తో సహా పలువురు మంత్రులు, ఆయా జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్లలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్(KTR) ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

Read Also: నిఫా వైరస్ కలకలం.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్...

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....