CM KCR |ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం కేసీఆర్ మొదటిసారి స్పందించారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు కవితను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ప్రజల కోసం కడుపు కట్టుకొని పనిచేయాలని తెలిపారు. ఈడీ విచారణకు హాజరయ్యాక రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేనికీ భయపడాల్సిన అవసరం లేదని, పోరాటం తీవ్రరూపం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం రేపు(శనివారం) కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనుంది.
Read Also: కేసీఆర్ కవితను పార్టీ నుంచి బహిష్కరించాలి: రేవంత్ రెడ్డి
Follow us on: Google News