ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు( Iftar Party) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 12 న ముఖ్యమంత్రి కేసీఆర్(KCr) ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎల్బీ స్టేడియం లో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, హోమ్ మంత్రి మహమూద్ అలీతో కలిసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మతసామరస్యం వెల్లివిరిసేలా రంజాన్ వేడుకలు నిర్వహించనున్నట్టు మంత్రి కొప్పుల తెలియజేశారు.
- Advertisement -
Read Also: కేసీఆర్ కు మాజీ మంత్రి జూపల్లి సూటి ప్రశ్న
Follow us on: Google News, Koo, Twitter