Cm Kcr Will Visit Nallgonda Today: నేడు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కేసీఆర్ (Cm Kcr) పరిశీలించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్నారు. మధ్యహ్నం12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 70 శాతం పూర్తయింది. రూ. 30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను 5 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ప్రతి ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. కాగా.. 2023 సెప్టెంబర్ నాటికి యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించేలా ప్రణాళికలు వేస్తున్నారు.