మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను పరీశీలించిన నేతలు.. కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రూ.95వేల కోట్లను ఖర్చు చేస్తే.. 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్వీట్ చేశారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) బలైదంని విమర్శించారు.
అంతకుముందు సీఎం బృందం అసెంబ్లీ నుంచి నేరుగా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ(Medigadda Barrage) బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాలపై పోరాటం అంటూ నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.