CM Revanth Reddy | ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ ప్రకటించిన సీఎం

-

త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేదని కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ(Modi), కేసీఆర్(KCR) కలిసి రూ.1200కు పెంచారని విమర్శించారు.

- Advertisement -

దీంతో మహిళలకు ఊరట కలింగించేలా సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రియాంక గాంధీ చేత ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పకొచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదని.. అప్పుడు బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. రేవంత్(CM Revanth Reddy) వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు.

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...