తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. శనివారం చెన్నైకి వెళ్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రణాళికలకు వ్యతిరేకంగా చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయడంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు డీఎంకే నేతలు జేఏసీ సమావేశానికి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో పాల్గొనడం కోసం తెలంగాణ కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి.. చెన్నైకి బయలుదేరారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే(DMK) మిత్రపక్షంగా వ్యవహిరిస్తోందా? లేకుండా డీలిమిటేషన్‌కు(Delimitation) వ్యతిరేకంగా స్వరం వినిపించడానికి చెన్నై వెళ్తుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని డీఎంకే నేతలు రేవంత్‌ను ఢిల్లీలో కలిసి ఆహ్వానం అందించారు. వారి ఆహ్వానం మేరకే రేవంత్(Revanth Reddy).. శనివారం జరిగే జేఏసీ సమావేశంలో పాల్గొననున్నారు.