ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎటువంటి తప్పులు మాట్లాడలేదన్నారు. శనివారం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో ఆయన భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు రేవంత్. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతూ.. మీడియాతో మాట్లాడారు. ‘
‘మోదీ(PM Modi) విషయంలో నేను ఎటువంటి తప్పుడు కామెంట్ చేయలేదు. ఆయన హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచి మాట్లాడలేదు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాను. కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీ గా మారారు అన్న తేదీ సమయం విషయంలోనే తేడా ఉండొచ్చు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నాను’’ అని Revanth Reddy స్పష్టం చేశారు.