ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్బంగా ఎస్ఎల్‌బీసీ(SLBC) ఘటనను ప్రధానికి వివరించారు రేవంత్ రెడ్డి. అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను కూడా వివరించారు. అక్కడి పరిస్థితులను తెలిపారు. లోపల ఇరుక్కున్న వారి ఆచూకి తెలుసుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి సహాయం కావాలని కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కూడా ప్రధాని మోదీ(PM Modi) దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి.
కేంద్రం బడ్జెట్‌లో కూడా తెలంగాణకు కేటాయింపులు ఏమీ చేయలేదన్న విషయాన్ని మోదీకి గుర్తు చేశారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూతనందించాలని, మూసీ నది ప్రక్షాళనకు(Musi River Cleanup) సహాకారం కావాలని కోరారు. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు కేంద్రం నుంచి ఆర్థికసహాయం కావాలని సీఎం(Revanth Reddy) కోరారు.