Revanth Reddy | కురుమూర్తి భక్తుల కోసమే ఘాట్ రోడ్ కారిడార్: రేవంత్

-

మహబూబ్‌నగర్‌లోని కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ రోజు మహబూబ్ నగర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. రూ.110 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఘాట్ రోడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడంటే అందుకు కురుమూర్తి స్వామి(Kurumurthy Swamy) చల్లని చూపే కారణమన్నారు. ఈ ఆలయ అభివృద్ధి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంలో ఇప్పటికి కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి చేయాల్సిన పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదిక అందిస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

- Advertisement -

‘‘పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నా. వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి పాలమూరు(Mahabub Nagar) జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి. నారాయణ్ పేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తాం. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు… జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు. నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్(Amara Raja Batteries) కంపెనీలో 2వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ వేదికగా కలెక్టర్స్ కు ఆదేశాలు ఇస్తున్నా. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరు’’ అని Revanth Reddy అన్నారు.

Read Also: రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీష్ రావు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...