తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. దేశంలో తొలిసారి కులగణన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని చెప్పారు. ‘‘ఆర్టీఐ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకు రండి కుల గణన చేస్తాము అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) హామీ ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు. తెలంగాణ ఇస్తాము అని ఇచ్చారు. తెలంగాణ లో బలహీన వర్గాలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మనం ఒక అవకాశం ఇద్దాం అని కాంగ్రెస్ ను గెలిపించారు.
ఈ మీటింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ను అమలు చేశాను. దేశంలో ఏ సీఎం, ఏ ప్రభుత్వం కుల గణన సాహసం చేయలేదు. పారదర్శకంగా కుల గణన చేసాము. సమగ్ర సర్వే గతం లో కేసీఆర్(KCR) 12 గంటల్లో చేశారు అని అంటున్నారు. ఆ లెక్కలు ను బయట పెట్టకుండా ఎన్నికల కు ఉపయోగించుకున్నారు. దేశంలో కుల గణన ఎక్కడ చేశారో.. అధికారులు బృందం ను పంపాము. బీహార్(Bihar), హర్యానా(Haryana) రాష్ట్రాల కు పంపినం. మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఇతర రాష్ట్రాల అనుభవంతో ప్లానింగ్ డేపర్ట్మెంట్ కు ఇచ్చాము వాళ్ల ను నోడల్ ఏజెన్సీ గా అప్పగించాము’’ అని చెప్పారు.
‘‘స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. బీజేపీ(BJP)లో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు.
దేశంలో కులగణన(Caste Census) చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే… కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం. ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి?’’ అని Revanth Reddy ప్రశ్నించారు.