Mahalakshmi Scheme | మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు: సీఎం రేవంత్

-

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని(Mahalakshmi Scheme), ఆరోగ్య శ్రీ(Aarogyasri) పరిమితిని రూ.10 లక్షలకు పెంచే ‘అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించే తొలి బస్సును రేవంత్(Revanth Reddy), భట్టి(Bhatti) సమక్షంలో మంత్రి సీతక్క(Seetakka), సీఎస్ శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. దీంతో నేటి నంచి జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌.. హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

- Advertisement -

Mahalakshmi Scheme | ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియమ్మ జన్మదినంతో పాటు తెలంగాణ ప్రకటన వచ్చిన పండుగ రోజైన డిసెంబర్ 9న ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలకు లబ్ధి చేకూరనుందని రేవంత్ వెల్లడించారు.

Read Also: ఏపీలో ఉల్లిగడ్డ.. ఆలుగడ్డ.. రాజకీయాలు..

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...