నియోజకవర్గాల పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) ఆధ్వర్యంలో చెన్నైలో శనివారం నిర్వహించనున్న సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొననున్నారు. చెన్నై గిండీలోని ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.. సమావేశంలో పాల్గొనేందుకుగాను శుక్రవారం రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా ఏవిధంగా నష్టపోతాయనే అంశంపై ఇప్పటికే పలు వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలియజేశారు.. చెన్నై సమావేశంలోనూ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తన వాదనను దేశ ప్రజల ముందుంచనున్నారు.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అనంతరం తమిళనాడు, కేరళ, పంజాబ్ ముఖమంత్రులు ఎం. కె. స్టాలిన్, పినరయి విజయన్(Pinarayi Vijayan), భగవంత్ మాన్(Bhagwant Mann) లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడనున్నారు.