Indiramma Housing App | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ప్రత్యేక యాప్ ద్వారా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే యాప్‌ను రూపొందించే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ యాప్‌ను రాష్ట్రమంత్రి పొంగులేటి(Minister Ponguleti) ఇప్పటికే ఒకసారి పరిశీలించి పలు మార్పులు సూచించారు. కాగా తాజాగా ఈ యూప్ పూర్తి స్థాయిలో రూపొందించబడిందని, అతి త్వరలోనే లాంచ్ కానుందని ప్రభుత్వం చెప్తోంది.
ఈ యాప్(Indiramma Housing App)ను గురువారం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు విషయాన్ని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా లబ్ఢిదారుల ఎంపికను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ వరకు అన్ని దశల్లో వీలైనంత సాంకేతికతను వినియోగించనున్నామని, అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నామని చెప్పారాయన. గ్రామీణులను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌లో తెలుగు వెర్షన్ చర్చలు తీసుకున్నామని తెలిపారు పొంగులేటి.