అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత రేవంత్ రెడ్డి(Revanth Reddy).. పార్టీ నేతలతో సీఎల్‌పీ సమావేశం(CLP Meeting) నిర్వహించారు. ఇందులో అసెంబ్లీ సభల్లో నడుచుకోవాల్సిన విధానాలపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై నిర్వహించాలి వంటి అంశాలను చర్చించారు.
‘‘ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు(Budget Sessions). ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యే లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. జిల్లాల వారీగా ఎమ్మెల్యేతో సమావేశం అవుతా’’ అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు.