కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా యూట్యూబ్ చానల్స్ ఆమెని ఫేమస్ చేశాయి. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో సందీప్ కిషన్ కూడా ఆ స్టాల్ కి వెళ్లి ఫుడ్ టేస్ట్ చేశారంటే ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా ఆమె ఫుడ్ స్టాల్ ని విజిట్ చేయాలి అనుకోవడం విశేషం. అయితే CM ఆమె కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్ళాలి అనుకోవడం వెనుక ఓ కారణం ఉంది.
ఫుడ్ బ్లాగర్స్ పుణ్యమా అని కుమారి ఆంటీ(Kumari Aunty) ఫుడ్ స్టాల్ కి జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ పై కేసు నమోదు చేసి, రోడ్లపై భోజనం చేయడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ ని మరో ఏరియాకి మార్చాలని డిసైడ్ చేశారు. అధికారుల నిర్ణయం తమ పొట్ట కొట్టేలా ఉందని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫుడ్ స్టాల్ ను మార్చాలనే విషయంపై పునః పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. అదే ఏరియాలో స్టాల్ యదావిధిగా కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం అలాంటి వ్యాపారస్తులకు అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైపు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, త్వరలోనే కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని విజిట్ చేసి, అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని CM Revanth Reddy డిసైడ్ అయినట్లు సమాచారం.