నాగార్జున సాగర్(Nagarjuna Sagar) దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అసలేమైందంటే.. నాగార్జున సాగర్ కుడి కాలువ వాటర్ రీడింగ్ నమోదు చేసుకోవడం కోసం తెలంగాణ అధికారులు వచ్చారు. వారిని ఆంధ్ర అధికారులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా చిలికి చిలికి గాలివాన తరహాలో పెరిగి పెద్దదైంది. ఈ విషయం తెలిసిన వెంటనే సాగర్ ఎస్‌ఈ కృష్ణమోహన్ అక్కడకు చేరుకున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులను ఆయన మందలించారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని హెచ్చరించారని కూడా సమాచారం.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. అధికారులు మధ్య వివాదం
-