సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నారని ఆరోపించారు. కృష్ణానదిపై పాలమూరు తప్ప కొత్త ప్రాజెక్టేది అని అడిగారు. అవన్నీ కాంగ్రెస్ కట్టినవే అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరిగాయని.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అమ్మేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కేవలం భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమేనని ఇందులో యాదాద్రి ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రొడక్షన్‌లోకే రాలేదని భద్రాద్రి గతే డాది వెయ్యి మెగావాట్లతో ప్రొడక్షన్‌లోకి వచ్చిందని అలాంటప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేదని ఎలా ప్రచారం చేస్తారని భట్టి(Bhatti Vikramarka)నిలదీశారు.
Read Also: నేరస్తులకు అడ్డాగా పాతబస్తీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News