తెలంగాణలో వరదల కారణంతో ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడానికి అనేక మంది సినీతారులు, వ్యాపరస్తులు సీఎం సహాయనిధికి భారీ విరాళాలు(CM Relief Funds) అందించారు. తాజాగా వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ పలహాదారులు అంతా కూడా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ సూచనల మేరకు వారు ఈ విరాళాలు ప్రకటించారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ కూడా వరద బాధితులకు అండగా నిలిచింది.
CM Relief Funds | నిత్యావసరాల కిట్‌లను వరద బాధితులకు అందించింది. దాదాపు పది వేల కిట్లను లారీలో ఖమ్మంకు పంపింది. ఒక్కో కిట్ విలువ రూ.3 వెలు ఉంటుందని హైసియా తెలిపింది. కాగా వరద సహాయం విషయంలో హైసియా చూపిన చొరవను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. అంతేకాకుండా వరదల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో రికార్డు స్థాయి వర్షాలు పడినా వరదలు రాకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.