బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిపై పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi) మండిపడ్డారు. తనను కౌశిక్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రవాడు అంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్న తనను పక్క రాష్ట్రం పౌరిడిగా మాట్లాడాటం ముమ్మాటికీ తప్పుగానే పరిగణించాలని కోరారాయన. కౌశిక్ రెడ్డి మాటలకు బీఆర్ఎస్(BRS) బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. అలా బాధ్యత వహించే పని అయితే అతని వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అంతేకాకుండా కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘‘ప్రశాంతమైన ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని బేషరుతుగా పదవి నుంచి తొలగించాలి. ఆయన ఆహ్వానిస్తేనే ఇంటికి వెళ్లాను. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన తన అనుచరులపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన సతీమణి కూడా స్వయంగా పై నుంచి పూల కుండీలు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అంటూ గాంధీ(Arekapudi Gandhi) వివరించారు.