షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar).. వెలమ కులస్థులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వెలమ నా కొడకల్లారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై వెలమ కులస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈరోజు తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు శంకర్ వెల్లడించారు.
వెలమ కులస్థులను(Velama Caste) దృష్టిలో పెట్టుకుని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఆ మాటలు మాట్లాడానని, అంతే తప్పా వేరే ఎవరినీ ఉద్దేశించి, మనసులో పెట్టుకుని తాను తిట్టలేదని వివరణ ఇచ్చారు. తన మాటలకు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.
‘‘వెలమ నా కొడుకుల్లారా మిమ్మల్ని చంపి తీరుతాం. సీఎం రేవంత్(Revanth Reddy)కు తెల్వకుండా మీ అంతు చూస్తాం. వీపు విమానం మోత మోగిస్తాం. వెలమ నా కొడుకులు బయట తిరగకుండా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర పన్నితే దాడులు తప్పవు. కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులంతా నేరుగా దాడి చేస్తాం. కబడ్ధార్’’ అంటూ శంకర్(Veerlapally Shankar) రెచ్చిపోయారు. ఆయన వ్యాఖ్యలపై వెలమ కులస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.