వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో ఫార్మి సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించడానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prathik Jain) సహా ఆర్డీఓ స్థాయి అధికారులపై స్థానికులు, రైతులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి(MP Chamala) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం మంచి పనులను చేపడుతుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వికారాబాద్‌లో జరిగిన దాడి వెనక విపక్షాల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘కలెక్టర్‌పై దాడిని ప్రోత్సహించిన వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలే. కేటీఆర్(KTR) తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి కావాలనే ఫార్మా సిటీకి భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆయన ప్రజలకు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారో నాకర్థం కావట్లేదు. ఆయనే అయినా చెప్పాలి. ఏది ఏమైనా అధికారులపై దాడులకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలబోము’’ అని తేల్చి చెప్పారు MP Chamala. అయితే వికారాబాద్ ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు.