Komatireddy venkat reddy: తెలంగాణ కోసం మంత్రి పదవి వదలుకున్నా..

-

Komatireddy Venkat Reddy sensational comments on minister KTR: వెంకట్‌ రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ కాదు.. కోవర్ట్‌ బ్రదర్స్‌ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదలుకున్నా.. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావు కేటీఆర్‌ అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా అని నిలదీశారు. కేటీఆర్‌(KTR) ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తనపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, కేటీఆర్‌పై పలు విమర్శలు చేశారు. “కేటీఆర్‌ నీ అవినీతి చిట్టా మెుత్తం నాకు తెలుసు.. నువ్వు విదేశాలకు వెళ్లి ఏం చేశావో కూడా తెలుసు” అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తడిచర్లలలో రూ. 10 వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా.. ముందు నీ చెల్లి కవితను కాపాడుకో కేటీఆర్‌ అని సూచించారు.

తన విదేశీ పర్యటన తన వ్యక్తిగతం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలు తిట్టారన్న బాధతోనే మునుగోడులో ప్రచారానికి వెళ్లటం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పే నేతలు.. మునుగోడు ఉప ఎన్నికకు 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులను ఎందుకు దించారని నిలదీశారు. అయినా తను ప్రచారానికి వెళ్లినా, వెళ్లకపోయినా, టీఆర్‌ఎస్‌ వాళ్లకు ఎందుకని వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: చండూరులో రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...