భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కి కాంగ్రెస్ హై కమాండ్ షాకిచ్చింది. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న వెంకట్ రెడ్డి కి.. ఇటీవల ప్రకటించిన పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలలో చోటు దక్కలేదు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, కార్యవర్గ చైర్మన్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. కోమటిరెడ్డి పేరు లేకుండానే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని అధిష్ఠానం నియమించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది.
మునుగోడు ఉపఎన్నికల సందర్భంలో వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ భవిష్యత్, కార్యచరణ ఏంటనేది వచ్చే ఎన్నికల్లోగా ప్రకటిస్తానని వెంకట్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి.