ఉచిత కరెంట్ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి స్పందించారు. తానా సభలో తాను చేసిన కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 24 గంటలు ఉచిత కరెంటు(24 Hours Free Electricity) ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తద్వారా రైతులకు 24 గంటల కరెంట్ విద్యుత్‌పై జరుగుతోన్న ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రేవంత్(Revanth Reddy). మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా ఈ అంశంపై స్పందించారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ఫ్రీ పవర్ ఇస్తున్నా అది కాంగ్రెస్ ఘనతే అని అన్నారు. బీఆర్‌ఎస్ లీడర్స్ గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Read Also: బోనాల పండుగకు ముందురోజు బోయిన్‌పల్లిలో దారుణం
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat