తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించగా.. బీఆర్ఎస్(BRS) 39 స్థానాలకు, బీజేపీ(BJP) 8 స్థానాలకు, ఎంఐఎం(MIM) 7 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్ మిత్ర పక్షం సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.