హయత్‌నగర్ కానిస్టేబుల్ నాగమణి(Constable Nagamani) హత్యపై ఆమె భర్త శ్రీకాంత్ స్పందించారు. తమది ఎనిమిదేళ్ల ప్రేమ అని వివరించారు. ‘‘మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నాలుగు సంవత్సరాలు తన హాస్టల్ లోనే ఉండింది. ఆ సమయంలో తానే ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాము.
పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాము. మేము పెళ్లి చేసుకున్నప్పటినుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యుల బెదిరిస్తూ వచ్చారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడు. రాయపోల్ నుండి హయత్ నగర్ బయలుదేరేముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను. ఆయన వెళ్లే లోపే రక్తపు మడుగులో నాగమణి(Constable Nagamani) కొట్టుకుంటుంది. అనంతరం ప్రాణాలు విడిచింది’’ అని శ్రీకాంత్ వివరించారు.