దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆ కంపెనీ భారీ పెట్టుబడి!

-

తెలంగాణకు పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో భారీ కంపెనీ ముందుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ త‌యారీ ప‌రిశ్రమ పెట్టాల‌ని కార్నింగ్ కంపెనీ(Corning Company) నిర్ణయించింది. ఈ మేర‌కు కార్నింగ్ కంపెనీ ప్రతినిధుల‌తో ఒప్పందం కుదిరింద‌ని కేటీఆర్ వెల్లడించారు.

- Advertisement -

రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ(Corning Company) వెల్లడించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారీ కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో 800 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు.

Read Also: ఆర్-5 జోన్‌ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...