Telangana |గత రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. కరోనా బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మహమ్మారి మరోసారి విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదు అవుతున్న పరిస్థితులలో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోజువారీ కేసుల సంఖ్య కనీసం 50కి పైగానే నమోదవుతోంది. అలాగే గడచిన 24 గంటల్లో 5,254 కరోనా పరీక్షలు నిర్వహించగా, 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 30 కొత్త కేసులను గుర్తించారు. అలాగే మిగిలిన జిల్లాల వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్ 2, కామారెడ్డి 3, కరీంనగర్ 2, ఖమ్మం 2, మెహబూబ్‌నర్ 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజ్‌గిరి 3, రాజన్న సిరిసిల్ల 1, రంగారెడ్డి 2, సంగారెడ్డి 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 17 మంది కరోనా నుంచి కోలుకోగా.. 267 మంది కరోనా కారణంగా ఐసొలేషన్‌లో ఉన్నారు.
Read Also: ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సీరియస్
Follow us on: Google News