తెలంగాణ గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్(CP Radhakrishnan) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గవర్నర్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అధారే.. ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గవర్నర్లుగా పనిచేసిన నరసింహన్, తమిళిసై సౌందర్ రాజన్, ఇప్పుడు రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం.
కాగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) 1998, 1999లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న ఝార్ఖండ్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. తమిళిసై రాజీనామాతో ఆయనను తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు.