డ్రగ్స్ కట్టడిపై సిటీ పోలీసులతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) కీలక భేటీ నిర్వహించారు. హైదరాబాద్ లో రెండు నెలల్లో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలని అధికారులకు సూచించారు. నగర కమిషనరేట్ పోలీస్ అధికారులతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్(Drugs) ను పూర్తిగా కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాటే వినిపించకూడదని అన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్(Friendly Police) వర్తిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారిని కూడా సహించేది లేదని తేల్చి చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని మార్చడానికి అందరూ కృషి చేయాలని సీపీ(CP Srinivas Reddy) సూచించారు.