MLA Candidates |తెలంగాణ ఎన్నికల్లో భాగంగా 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి 360 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో 226 మంది నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించి నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల డేటాను విడుదల చేసింది. 48 శాతం మంది అభ్యర్థులు నేరచరిత్ర ఉన్న వారేనని చెప్పింది.
బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సీఎం కేసీఆర్ పై 9 కేసులు ఉన్నాయి. ఇక అత్యధికంగతా కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 10 కేసులు, కేటీఆర్‌పై 8, సబితా ఇంద్రారెడ్డిపై 5, సైదిరెడ్డిపై 5 కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై అత్యధికంగా 89 కేసులు, ఖానాపూర్ అభ్యర్థి బుజ్జిపై 52, ప్రేమ్ సాగర్ రావుపై 32, పి శ్రీనివాస్ పై 24, జయప్రకాశ్ రెడ్డిపై 20 కేసులు, జగ్గారెడ్డిపై 20 కేసులు ఉన్నాయి.
బీజేపీ నేతల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్(Raja Singh) పై అత్యధికంగా 89 కేసులు ఉండగా.. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌పై 59, బోధ్ అభ్యర్థి సోయం బాపూరావుపై 55 కేసులు, ఈటల రాజేందర్ పై 40, రఘునందన్ పై 27, ధర్మపురి అర్వింద్ పై 17, మేడిపల్లి సత్యంపై 18 కేసులు ఉన్నట్లు తేలింది. ఇక మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై 6 కేసులున్నాయి.
MLA Candidates |అన్ని పార్టీల నుంచి 48 శాతం మంది అభ్యర్థులు నేరచరిత్ర ఉన్న వారేనని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మంది అభ్యర్థులపై 540 కేసులు.. బీజేపీకి చెందిన 78 మంది అభ్యర్థులపై 549 కేసులు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులపై 120 కేసులు.. ఎంఐఎం అభ్యర్థులపై 11 కేసులు ఉన్నట్లు వెల్లడించింది.