కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే సీఆర్పీఎఫ్ పరీక్షలు(CRPF Exams) ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగులోనూ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని మంత్రి కేటీఆర్(KTR) ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా.. ప్రాంతీయ భాషల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షల(CRPF Exams)ను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. స్థానిక యువత ప్రమేయాన్ని పెంచే దిశగా కేంద్ర హోం మంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో వెల్లడించింది. దీంతో హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
Read Also: కేసీఆర్‌ది దరిద్రపు పాలన.. నిజామాబాద్ ఇన్సిడెంట్‌పై స్పందించిన షర్మిల
Follow us on: Google News, Koo, Twitter