Godavari |నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు భద్రాచలం బ్యారేజీ దగ్గర నీటి మట్టం డేంజర్ మార్క్‌ను దాటింది. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 52.1 అడుగులకు చేరిందని వెల్లడించారు. ఇప్పటికే రెండు డేంజర్ మార్క్‌లనరు దాటిన నీటిమట్టం ఈరోజు సాయంకాలానికి మూడో డేంజర్ మార్క్ 53 అడుగులను చేరుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రాకపోకలకు అవకాశమే లేని విధంగా రోడ్ల పరిస్థితి తయారైంది.
Godavari | పలు ఏఎంసీ కాలనీల నుంచి స్థానికుల తరలింపు ప్రక్రియను కూడా అధికారులు చేపట్టారు. కాలనీల చుట్టూ బ్యాడ్ వాటర్ చేరుకోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే ప్రమాద స్థాయిలో వరద పొంచి ఉన్న క్రమంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కూడా చెప్పారు.